మన్మధరావు మొదటినుంచీ గ్రంధసాంగుడు. కాలేజీలో అతడు నడిపిన అఫైర్లకు లెక్కే లేదు. అయితే అతడి స్పెషాలిటీ కాల్ గాళ్స్. ఎంతమందిలో ఉన్నా ఆ రకం ఆడదాన్ని అతను ఇట్టే గుర్తు పట్టెస్తాడు. అంతే కాక ఆమె ఏ రకం ఎంత అనుభవం ఉంది, సురక్షితమా కాదా ఇలా అన్ని వివరాలు చూపులతోనే అంచనా వేయగల అనుభవశాలి.
అయితే అతని మన్మధ లీలలకి పెళ్ళితో అడ్డుకట్ట పడింది. బాగా డబ్బున్న మామకి ఒకటే కూతురని చూడ్డానికి అనాకారిగా ఉన్నాఒప్పుకొని ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అందంతో పని ఏముంది తన ప్రియురాళ్ళతో పనవుతూ ఉంటుంది కదా అన్న అతని నమ్మకాన్ని ఆ పెళ్ళాం పెళ్ళయిన మొదటి నెలలోనే తుంచి వేసింది. వెధవ్వేషాలేస్తే తుపాకీ పెట్టి కాల్చిపారేస్తానని వార్నింగ్ ఇవ్వడమే కాక ఒక డబుల్ బారెల్ షాట్ గన్ ని లోడ్ చేసి పడగ్గదిలో పెట్టి ఉంచింది. ఆమె అన్నంత పని చేయగల సమర్ధురాలు అని తెలిసిన అతను అన్ని వెధవ వేషాలు కట్టి పెట్టి ఆనాటి నుంచి ఏకపత్నీవృతుడై పోయి తన శృంగారన్ని కలలకే పరిమితం చేసుకున్నాడు.
మన్మధరావు దంపతులు తమ అయిదో వివాహ వార్షికోత్సవానికి ఢిల్లీ వెళ్ళారు. ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు. స్నానాలు చేసి బయటకెళ్దామని బయలు దేరుతూ మన్మధరావు కొంచెం ముందుగా హోటల్ లాబీ లోకి వచ్చాడు. అతని భార్య తయారు కావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొనే అలవాటున్నది అవడంతో అతను ఒక సోఫాలో కూర్చుని వచ్చీ పోయే వాళ్ళని చూస్తున్నాడు.
అంతలో అతనికి ఒక బాగా అందమైన అమ్మాయి కనిపించింది. ఆమెని చూడగానే కనిపెట్టేశాడు ఆమె కాల్ గాళ్ అని. ఆమె రిసెప్షనిస్టు దగ్గర ఏదో మాట్లాడి బయటకు నడుస్తూ ఉండగా ఆమెని చూశాడు మన్మధరావు. అతనికి నరాలు జివ్వుమన్నాయి. అయినా ఏమీ చేయలేని నిస్సహాయత. కనీసం నోటిదూల అయినా తీర్చుకుందామని అటూ ఇటూ చూశాడు. పెళ్ళాం జాడ లేదు. సరాసరి ఆమె దగ్గరికి వెళ్ళి"హలో" అన్నాడు.ఆమె అతని వైపు చూసింది. సరిగ్గా అరనిమిషంలో ఇద్దరికీ చానల్ ఏర్పడింది.
"ఖాళీయా?" అడిగాడు. "ఎస్" చెప్పింది. "ఎంత?" అన్నాడు. "రాత్రంతా అయితే లక్ష.గంటకి పాతిక వేలు" చెప్పింది. ఆమెని ఎగాదిగా చూశాడు. బాగా కాస్ట్లీ ఫిగరు. అయినా రాత్రికి లక్ష ఇవ్వాచ్చు దీనికి అనుకున్నాడు. అతనికి గుండె మండింది. దగ్గర డబ్బులున్నాయి. ముందు ఖాళీగా పిలుస్తూ పిల్ల ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఇంతలో దూరంగా అతడి భార్య కనిపించింది. గుండె గుభిల్లుమంది. వెంటనే వదిలించుకోవాలి. అయినా కదిలించాక ఎమీ చెప్పకుండా వెళ్ళలేడు.
"గంటకి వెయ్యిస్తా.వస్తావా?" అన్నాడు. అతనితో ఒక్క మాట మాటలాడ్డం కూడా వేస్ట్ అని ఆమె థూ అని ఉమ్మేసి చరాచరా వెళ్ళి పోయింది. బతికానురా బాబూ అని పెళ్ళానికి ఎదురెళ్ళాడు. ఇద్దరూ కలిసి బయటకు
వస్తూండగా అతను ఇంతకుముందు కలిబెట్టిన అమ్మాయి ఎదురయ్యింది.
"గంటకి వెయ్యంటే
ఇలాంటి చంఢాలపు లం--లే వస్తాయిరా వెధవా" అని మరోసారి అతడిని చూసి ఉమ్మేసింది.
mee jokes chala bagunnai.
ReplyDeletegreat aandhra
Thank you Ram.
ReplyDelete