సుబ్బారావు ఒలింపిక్స్ చూడటానికి బీజింగ్ వెళ్ళాడు రెండేళ్ళ క్రితం. ఒక మధ్యాహ్న వేళ బాగా దాహం వేసి ఒక రెస్టారెంటులోకి వెళ్ళి కూర్చున్నాడు. అందమైన ఒక అమ్మాయి వచ్చి "ఏం కావాలి?" అని చైనీస్ బాషలో అడిగింది.
ఆ బాష ఒక ముక్క అర్ధం కాకపోయినా విషయం అర్ధం చేసుకున్నవాడయి,"ఆరంజ్ జ్యూస్" అన్నాడు.
అది ఆ పిల్లకి అర్ధం కాక ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగింది. సుబ్బారావు ఎంత తనకలాడినా అతగాడికేం కావాలో ఆ అమ్మాయికి అర్ధం అయ్యేలా చెప్పలేకపోయాడు.
కాస్సేపు కుస్తీ పట్టాక ఆ పిల్లని పైనుంచి కిందకు చూసిన మనవాడీ బుర్ర ఒక్కసారిగా వెలిగింది. ఆ రెస్టారెంటు పేరే ఆరంజ్ లా ఉంది. అక్కడ ఉన్న అన్ని వస్తువుల మీదా ఆరంజ్ బొమ్మ ఉంది. చివరికి అక్కడ పని చేసే వాళ్ళ యూనిఫామ్ లతో సహా. ఆ అమ్మాయి చాతీ పైన ఉన్న ఆరంజ్ ని చూపించి చేత్తో గ్లాసు పట్టుకొని తాగుతున్నట్టు సైగ చేశాడు.
ఆ అమ్మాయి చప్పున లోపలికెళ్ళి ఒక గ్లాసు పాలు తెచ్చి టేబుల్ పైన పెట్టింది.